కేటీఆర్ ను కలిసిన బీఆర్ఎస్ నేతలు.. 

BRS leaders met KTR..నవతెలంగాణ – ముధోల్ 
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను గురువారం ఆ పార్టీ ముధోల్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యులు డా. కిరణ్ కుమార్, లోలం శ్యామ్ సుందర్ లు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ముధోల్ నియోజకవర్గ పార్టీ స్థితి గతులు, సమస్యలు, అభివృద్ధిపై చర్చించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని అన్ని ఉమ్మడి జిల్లాలో కొత్తగా నవోదయ విద్యాలయాలు మంజూరు చేయగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మంజూరు కాలేదనే విషయం కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చామని వారు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో నవోదయ విద్యాలయం విషయం ప్రస్తావించాలని వారు కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నప్పటికీ ఈ విద్యాలయం మంజూరు కాలేదని  వారు వివరించారు.  నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం త్వరలోనే ఉంటుందని, కేటీఆర్ వస్తానని చెప్పినట్లు  వారు పేర్కొన్నారు.
Spread the love