మేడిగడ్డకు తరలిన బీఆర్ఎస్ నాయకులు

నవతెలంగాణ – పెద్దవంగర
‌మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం మేడిగడ్డకు తరలి వెళ్లారు. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు కౌంటర్ గా బీఆర్ఎస్ ఛలో మేడిగడ్డ కు పిలుపునిచ్చింది. అందులో భాగంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆద్వర్యంలో మండలానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున మేడిగడ్డకు తరలివెళ్లారు. వెళ్ళిన వారిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కేతిరెడ్డి సోమ నరసింహారెడ్డి, నాయకులు శ్రీరామ్ సుధీర్, దుంపల సమ్మయ్య, విశ్వనాథుల జ్ఞానేశ్వర్ చారి, రాసాల సమ్మయ్య, బొమ్మెరబోయిన రాజు యాదవ్, కనుకుంట్ల వెంకన్న, బానోతు సోమన్న, గుగులోత్ పటేల్ నాయక్,  పసులేటి వెంకటరామయ్య, కూకట్ల వీరన్న, పులిగిల్ల కుమారస్వామి, దంతాలపల్లి నగేష్ తదితరులు ఉన్నారు
Spread the love