భువనగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిపై తప్పుడు కధనాలు ప్రసారం చేసిన బిగ్ టీవీ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని భువనగిరి పట్టణ అధ్యక్షులు ఏవీ కిరణ్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ లో బి ఆర్ ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమం లో రైతు సమన్వయ జిల్లా కన్వీనర్ అధ్యక్షులు కొల్పుల అమరేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయన ఆంజనేయులు, పట్టణ అధ్యక్షులు కిరణ్ కుమార్, కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు గోపాల్, కౌన్సిలర్ లు జిల్లా బి ర్ ఎస్ నాయకులు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.