ఫాంహౌస్ లో కేసీఆర్ ను కలిసిన బీఆర్ఎస్ నేతలు

నవతెలంగాణ హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి లోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కేసీఆర్ ను కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలకు అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.  కేసీఆర్ ను కలిసిన వారిలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మహ్మద్ అలీ, కడియం శ్రీహరి, మల్లా రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మేల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ ఇతర నేతలు కేసీఆర్ గారిని కలిసిన వారిలో ఉన్నారు.

Spread the love