నేడు బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన అధికార బీఆర్ఎస్ పార్టీ ఇవాళ వారికి బీ ఫారాలు అందజేయనుంది. మరోవైపు ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేసి తెలంగాణ ప్రజలకు వరాలు ప్రకటించనున్నారు. మేనిఫెస్టోపై కొంతకాలంగా కసరత్తు చేస్తున్న కేసీఆర్ .. ఇతర పార్టీలు ఇస్తున్న హామీలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు వివిధ సర్వేల ఆధారంగా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Spread the love