నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పృహ తప్పి పడిపోయాడు. కరీంనగర్ హుజురాబాద్‌లో దళిత బంధు రెండో విడత డబ్బులు విడుదల చేయాలని ధర్నాకు దిగారు. అనంతరం పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. బలవంతంగా పోలీసు వాహనంలో కుక్కి పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో సృహ తప్పి పడిపోయాడు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తోపులాటలో సృహ తప్పి పడిపోయిన పాడి కౌశిక్ రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. ప్రాణం పోయే వరకు నా దళిత బిడ్డల కోసం పోరాడుతాని కౌశిక్ రెడ్డి అన్నారు. దళిత బంధు ఎందుకు ఇవ్వరు అని అడిగితే ఈ విధంగా లాఠీ ఛార్జ్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు