కాంగ్రెస్‌ గూటికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తెల్లం

కాంగ్రెస్‌ గూటికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తెల్లంనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
భద్రాచలం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆదివారం హైదరాబాద్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో ఆయన హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్‌ ఆయనకు కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌ కీలక నేత, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి అనుచరుడిగా ఉన్న తెల్లం వెంకట్రావ్‌ శనివారం జరిగిన తక్కుగూడలో కాంగ్రెస్‌ నిర్వహించిన జనజాతర సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై ఆయన రాహుల్‌గాంధీని కలిశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Spread the love