బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత మరో షాక్..

నవతెలంగాణ – న్యూఢిల్లీ : ఢిల్లీ మ‌ద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ పొడిగించింది కోర్టు. ఈడీ కేసులో రిమాండ్ ముగియ‌డంతో క‌విత‌ను వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా తీహార్ జైలు నుంచి హాజ‌రు ప‌రిచారు అధికారులు. దర్యాప్తు కొన‌సాగుతున్నందున రిమాండ్ పొడిగించాల‌ని కోర్టును ఈడీ కోరింది. ఈడీ విజ్ఞ‌ప్తి మేర‌కు ఈ నెల 20వ తేదీ వ‌ర‌కు క‌స్ట‌డీ పొడిగిస్తూ కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. 8 వేల పేజీల స‌ప్లిమెంట‌రీ ఛార్జిషీట్ దాఖ‌లు చేసిన‌ట్లు ఈడీ తెలిపింది. స‌ప్లిమెంట్ ఛార్జిషీట్ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే అంశంపై ఈ నెల 20న కోర్టు విచార‌ణ చేప‌ట్ట‌నుంది.

Spread the love