కొలంబస్‌లో బీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సదస్సు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌- యూఎస్‌ఏ కార్యకర్తల పాత్ర కీలకంగా మారుతుందని భారత రాష్ట్ర సమితి యూఎస్‌ఏ అడ్వయిజరీ బోర్డు చైర్మెన్‌ తన్నీరు మహేష్‌ చెప్పారు. రాష్ట్రం ఐటీ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించిందనీ, అది కొనసాగాలంటే మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. కొలంబస్‌ నగరంలో బీఆర్‌ఎస్‌-యూఎస్‌ఏ జాతీయ సదస్సు జరిగింది. దీనికి అతిధులుగా అటార్నీ వినీత మెహ్రా, ఫెడరేషన్‌ అఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్స్‌ అధ్యక్షులు అరిందమ్‌ గుహ, బ్లూ యాష్‌ సిటీ కౌన్సిల్‌ వైస్‌ మేయర్‌ ప్రమోద్‌ ఝవేరి, బీఆర్‌ఎస్‌ – యుఎస్‌ఏ కన్వీనర్లు పూర్ణ బైరి, చందు తాళ్ల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించారు.

Spread the love