కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం కాసేపటి క్రితమే మొదలైంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ, లోక్‌సభల్లో పార్లమెంటరీ పార్టీ నేతలు కే.కేశవ రావు, నామా నాగేశ్వర్‌రావుతో సహా ఎంపీలు హాజరయ్యారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు సమావేశంలో పాల్గొన్నారు.

Spread the love