నవతెలంగాణ రెంజల్: రెంజల్ మండలం బాగేపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం సర్పంచ్ పాముల సాయిలు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సాయిబాబా గౌడ్ మహిళలతో కలిసి గడపగడపకు పార్టీ ప్రచారాన్ని నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తూ తిరిగి బీఆర్ఎస్ పార్టీని గెలుపొందించాలని వారు అభ్యర్థించారు.