సంక్షేమ పథకాలు అందించడంలో బిఆర్ఎస్ పార్టీ విఫలం

Duddilla Sridhar Babu– మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు
– మహిళ రిజర్వేషన్ ఘనత కాంగ్రెస్ పార్టీదే
– అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలతో భరోసా
– బిఆర్ఎస్ నాయకుల అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి
నవ తెలంగాణ -కాటారం
సంక్షేమ పథకాలు అందించడంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మండల కేంద్రంలోని ఏవీఎస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజ్యసభలో మొదటిసారి మహిళ బిల్లును ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీని అని అన్నారు. చట్టసభలో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం శుభ పరిమాణం అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో తప్ప మరెక్కడ లేదని జీతాలు సకాలంలో రాక ప్రభుత్వ ఉద్యోగులు కష్టాలు పడుతున్నారన్నారు. బ్యాంకులకు ఈఎంఐలు చెల్లించలేక వడ్డీలు కట్టాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. గత ప్రభుత్వ హాయాలలో ఉద్యోగస్తులు జీతం పెరిగితే సంతోషించే వాళ్ళని, కానీ బిఆర్ఎస్ ప్రభుత్వంలో జీవితం పడితే సంతోషించాల్సి వస్తుందని ఆరోపించారు. బిఆర్ఎస్ లాగా మోసపూరిత ప్రకటనలు చేసే పార్టీ కాదని, పక్కనే ఉన్న కర్ణాటకలో హామీ ఇచ్చాము అక్కడ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అమలు చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మహిళలకు మహిళ లక్ష్మీ పథకం లో రు 500 లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ప్రతినెల 2500 లు. ఆర్టిసి బస్సులో ఉచిత ప్రయాణం, రైతు భరోసాలో రు.1500 వేలు, గృహ జ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్ల కింద ఇంటి స్థలం, రు.5 లక్షలు, యువ వికాసం కింద విద్యార్థులకు రు. 5 లక్షలు, చేయూత కింద రు.4 వేలు నెలవారి పెన్షన్ మొదలైన స్కీం లో అమలు చేస్తామని తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వ్యక్తి సోనియా గాంధీ అని అన్నారు. తెలంగాణ ఇస్తామని చెప్పి ఎంత నష్టం వచ్చినా తెలంగాణను ప్రకటించిన సోనియా గాంధీ అని అందుకే ఆ తల్లి ప్రకటించిన పథకాలు 100 శాతం అమలు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ ఉద్యోగులకు సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారుకెసిఆర్ ప్రభుత్వం, మంథని పార్టీ నాయకులు చేస్తున్నటువంటి అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతంగా చేయాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పై ఉందని పేర్కొన్నారు… ఈ కార్యక్రమంలో కాటారం ఎంపీపీ మంతకాని సమ్మయ్య, సర్పంచులు బాసాని రఘువీర్, రఘురాం నాయక్, ఎంపీటీసీ మహేష్ రవీందర్ రావు, మాజీ సర్పంచ్ సాగర్ రావు, మాజీ ఎంపీపీ రాజ నరసయ్య తదితరులు పాల్గొన్నారు

Spread the love