– రూ.2లక్షల పార్టీ ప్రమాద భీమా చెక్ అందజేత
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
పార్టీ సభ్యత్వం కలిగిన బిఆర్ఎస్ కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కొద్ది నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన బిఅర్ఎస్ పార్టీ కార్యకర్త గొడికే రమేష్ కు బిఅర్ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద భీమా( ఇన్సూరెన్స్) ద్వారా రూ.2లక్షల విలువగల చెక్కు మంజూరు అయ్యింది. అట్టి చెక్కును శుక్రవారం వేల్పూర్ లోని తన స్వగృహంలో మృతుడు గుడికే రమేష్ సతీమణి గొడికే రజిత కు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ పార్టీ సభ్యత్వం కలిగిన కార్యకర్తలకు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే వారి కుటుంబానికి అండగా ఉండటానికి ప్రమాద భీమా సౌకర్యం కల్పించారన్నారు. రాష్ట్ర లో 60 లక్షల పైచిలుకు మంది బిఅర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారని, బలమైన కార్యకర్తలు గల పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు. భీమా కోసం దాదాపు రూ.11కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులు కార్యకర్తల కోసం చెల్లిస్తున్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ మాత్రమే అన్నారు.బాల్కొండ నియోజకవర్గంలో సుమారు 50 వేల మంది కార్యకర్తలు సభ్యత్వం కలిగి ఉన్నారని తెలిపారు. ఇప్పటికీ నియోజకవర్గంలో ప్రమాదవశత్తు మృతి చెందిన 45 మందికి పైగా కార్యకర్తల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పార్టీ ప్రమాద భీమా చెక్కులు అందజేయడం జరిగిందన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.2లక్షల చెక్కుతో ఆర్థికంగా కొంత ఊరట కలుగుతుందన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నాగధర్ రెడ్డి, జిల్లా నాయకులు రాములు, పడగల్ సింగిల్ విండో చైర్మన్ హన్మంత్ రెడ్డి, నాయకులు రాజకుమార్, మాజీ ఎంపిటీసి శ్యామ్ రావు, తదితరులు పాల్గొన్నారు.