దానం నాగేందర్‌ అనర్హతపై హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్‌

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్‌ వ్యవహారంలో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానంపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ విషయంపై సభాపతి గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసినా స్పందించట్లేదని, అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపింది. సికింద్రాబాద్‌ లోక్‌సభ అభ్యర్థిగా కూడా దానం పేరును కాంగ్రెస్‌ ప్రకటించిందని, ఈ విషయంలో త్వరగా చర్యలు తీసుకునేలా సభాపతిని ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌ హైకోర్టులో సోమవారం విచారణకు వచ్చే అవకాశముంది.

Spread the love