బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి : వీహెచ్

నవతెలంగాణ హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ మాజీ ఎంపీ వీ.హనుమంతరావు లేఖ రాశారు. 10 ఏండ్ల పాలనలో సాగునీటి రంగంతో సహా వివిధ స్కీములు, ప్రాజెక్టుల్లో భారీ అవినీతికి పాల్పడినట్టు లెక్కలతో సహా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) అసెంబ్లీకి సమర్పించిన రిపోర్టులో పేర్కొన్నదని ఆయన అన్నారు. బీఆర్ఎస్ 10 ఏండ్ల పాలనలోని అవినీతి కారణంగా తదుపరి ప్రభుత్వాలు కాపిటల్ వ్యయంతో ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనపై ఆర్థిక అంశాల కారణంగా దృష్టి పెట్టే అవకాశం లేకుండా చేసిందని వీహెచ్ అసహనం వ్యక్తం చేశారు .

Spread the love