– పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ- తుంగతుర్తి: అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమమే సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని తుంగతుర్తి పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం తుంగతుర్తి పట్టణ కేంద్రానికి సంబంధించిన 231వ బూత్ లో బీఆర్ఎస్ వి నియోజకవర్గ అధ్యక్షుడు సంతోష్ గౌడ్ కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ సారధ్యంలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని అన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఉందని అన్నారు. పల్లె పట్నం గ్రామం తండా అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయని అన్నారు. సంక్షేమ పథకాలు సజావుగా సాగాలంటే వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ కారు గుర్తుపై ఓటు వేసి మూడోసారి గెలిపించడం ద్వారానే సాధ్యమవుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పుల నాగమల్లు, ఉప్పుల వీరయ్య, వీరయ్య, జవ్వాజి నాగరాజు, నారబోయిన అనిల్, నాగవెల్లి రమేష్, గుండెబోయిన రవి, మెంతబోయిన బిక్షం, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.