నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
డిస్కం విజ్ఞప్తి మేరకు ప్రజలపై అదనపు విద్యుత్ చార్జీలు మోపే ప్రయత్నాలు చేసిన బీఆర్ఎస్ ఒత్తిడితోనే ఆ నిర్ణయాన్ని ఈఆర్సీ కమిటీ వెనక్కి తీసుకుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. విద్యుత్ చార్జీలను పెంచకుండా ఇటీవల ఈఆర్సీ కమిటీ తీసుకున్న నిర్ణయం వెనుక బీఆర్ఎస్ ప్రధాన పాత్ర ఉందన్నారు. ఈ సందర్భంగా బుధవారం పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు. జై తెలంగాణ, జైజై తెలంగాణ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న మాట్లాడుతూ… కాంగ్రెస్ పది నెల పాలనలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసేల విధానాలను అవలంబిస్తుందన్నారు. డిస్కంల విజ్ఞప్తి మేరకు విద్యుత్చార్జీలను పెంచి రూ.18500 కోట్ల అదనపు భారం మోపేల యత్నించిందన్నారు. దీనిపై ఈఆర్సీ కమిటీ చేపట్టిన అభిప్రాయ సేకరణ, ఇతర సమావేశాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యతిరేకించారన్నారు. బీఆర్ఎస్ విజ్ఞప్తి మేరకు ఈఆర్సీ కమిటీ రూ.18500 కోట్ల అదనపు చార్జీల భారం నుంచి ప్రజలకు విముక్తి కలిటిందన్నారు. తమ విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించిన ఈఆర్సీ కమిటీకి ధన్యవాదలు తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న.. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో నాయకులు యాసం నర్సింగ్, రోకండ్ల రమేష్, యూనీస్ అక్బానీ, సాజిదొద్దిన్, రమేష్, రౌత్ మనోహర్, ప్రహ్లాద్, కుమ్ర రాజు, పరమేశ్వర్, పండ్ల శ్రీను, వేణుయాదవ్ పాల్గొన్నారు.