కారు దిగేస్తా.. బీఆర్ఎస్ సీనియర్ నేత హెచ్చరిక

నవతెలంగాణ – రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి తమ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ… నేను కేసీఆర్‌తో సమానంగా రాజకీయాల్లో ఉన్నా. ఉద్యమంలో పనిచేసిన సీనియర్‌ నాయకులు చాలామంది పార్టీని వీడుతున్నారు. వారందర్నీ పిలిపించి మాట్లాడాలి. వచ్చే ఎన్నికల్లో తనకు మహేశ్వరం నుంచి టికెట్ ఇవ్వకుంటే కారు దిగడం ఖాయమని ఆయన స్పష్టంచేశారు. ‘‘కాంగ్రెస్‌ నుంచి గెలిచిన సబితారెడ్డిని పార్టీలోకి తీసుకొని సీఎం కేసీఆర్‌ తప్పుచేశారు. మా కోడలు డా.అనితారెడ్డి రంగారెడ్డి జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఉండడంతో ఒకే ఇంట్లో రెండు పదవులు కావాలా అని అంటున్నారు. మేం కూడా విమర్శిస్తే బాగుండదు. లేకుంటే మా దారి మేం చూసుకుంటాం. కాంగ్రెస్‌ నుంచి నన్ను ఇప్పటివరకు ఎవరూ సంప్రదించలేదు’’ అని పేర్కొన్నారు.

Spread the love