కంచర్లలో ప్రచారాన్ని ప్రారంభించిన బీఅర్ఎస్

నవతెలంగాణ వీర్నపల్లి: వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామంలో మంగళవారం బీఅర్ఎస్ మండల అధ్యక్షులు రాజిరెడ్డి అధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం బీఅర్ఎస్ పదేండ్లుగా చేసిన అభివృద్దిని వివరిస్తూ ఇంటింటా తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి సిరిసిల్ల నియోజక వర్గ అభ్యర్థి కల్వకుంట్ల తారకరామారావును భారీ మెజార్టీతో గెలిపించాలని జెడ్పీ టిసి కళావతి, మహిళ అధ్యక్షురాలు కళా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మల్లేశం, జెడ్పీ కో ఆప్షన్ చాంద్ పాషా, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు కటుకురి రాజు, ప్రధాన కార్యదర్శి రఫీ, మండల నాయకులు సంతోష్ నాయక్, దినకర్, రాజు, లింబద్రి, మహేందర్, ఉస్మాన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love