బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దాస్యం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా

నవతెలంగాణ- హనుమకొండ
కేంద్ర ప్రభుత్వంపై బిఆర్‌ఎస్‌ ఎ మ్మెల్యే దాస్యం వినరు భాస్కర్‌ వ్యాఖ్య లను తీవ్రంగా ఖండిస్తున్నానని బిజెపి హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. శనివారం హనుమకొండ హంటర్‌ రోడ్‌ లోని బిజెపి కార్యాలయం లో ఆమె విలేకరులతో మాట్లాడారు. కేం ద్ర ప్రభుత్వం ఇక్కడ వేలాది కార్మికుల కో సం దాదాపు రూ.550 కోట్ల రూపాయిల నిధులను కేటాయించి రైల్వే వోపీహెచ్‌ ఫ్యాక్టరీ నిర్మిస్తుంటే దానికి కావాల్సిన స్థలం ఇవ్వకుండా జాప్యం చేస్తుంది మీరు కాదా అని ప్రశ్నించారు. కార్పొరేటర్‌ స్థాయి నుండి ఈరోజు ప్రభుత్వం విప్‌ అయన వినరు భాస్కర్‌ హనుమకొండ హంటర్‌ రోడ్‌ లోని ఆర్టీసీ రిట్రేడింగ్‌ ఫ్యాక్టరీని ఇక్కడి కార్మికుల పొట్ట కొట్టి కరీంనగర్‌ తరలించి ఆ భూమిని మీ పార్టీ నాయకుడికి కట్టబెట్టడంలో మీ పాత్ర లేదా ఇది వాస్తవం కాదా అని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయం నుండి ఆటో కార్మికులను ఏకాం చేసిన గుడిమళ్ల రవి కుమార్‌ ని మీ స్వలాభం కోసం వంచించి ఈరోజు ఆటో యూనియన్‌ కార్మికులను రెండు వర్గాలుగా చీల్చింది మీరు కాదా అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులను నిర్ధాక్షణీయంగా మీ ప్రభుత్వం రోడ్‌ పై నెట్టేస్తే వారికీ అండగా నిలిచి వారి పక్షాన పోరాడింది బిజెపి పార్టీ అని గుర్తు చేశారు.

Spread the love