– కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి అసహనం
– కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఆచార్య జయ శంకర్ వర్థంతి దినోత్సవం
నవతెలంగాణ – బెజ్జంకి
రాష్ట్ర ప్రజల అకాంక్షను నెరవేర్చాలనే గోప్ప సంకల్పంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టని.. ప్రజాధనంతో దశాబ్ది ఉత్సవాల పేరిటా తెలంగాణ ఉద్యమకారులను, అమరులను విస్మరించి సంబురాలు చేసుకుంటోంది బీఆర్ఎస్ ప్రభుత్వమని.. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాల్సిన అవశ్యకత ఉందని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి కోరారు. బుధవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో నాయకులు ఆచార్య జయ శంకర్ వర్థంతి దినోత్సవం ఏర్పాటు చేసి అయన చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ సంధర్భంగా రత్నాకర్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆజన్ముడు ఆచార్య జయశంకర్ అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం హార్భటంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర సాధన సిద్ధాంతకర్తగా పేరుపొందిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ కు ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఉద్యమకారులను విస్మరించడమేనని అసహనం వ్యక్తం చేశారు. మేథావుల సిద్ధాంతాలు, ప్రజల ఉద్యమాలు, అమరుల త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అమరుల కుటుంబాలు, ఉద్యమకారులు, ప్రజలు పదేండ్లుగా నయవంచనకు గురవుతునే ఉన్నరన్నారు. నాయకులు శానగొండ శ్రవణ్, రొడ్డ మల్లేశం, బోనగిరి రాజేందర్, బాబు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.