బీఆర్ఎస్ వ‌రంగ‌ల్ ఎంపీ అభ్య‌ర్థిగా మారేప‌ల్లి సుధీర్ కుమార్

నవతెలంగాణ –  హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌రంగ‌ల్ ఎంపీ అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ మారేప‌ల్లి సుధీర్ కుమార్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఫైన‌ల్ చేశారు. ఈ మేర‌కు కేసీఆర్ అధికారికంగా ప్ర‌క‌టించారు. వ‌రంగ‌ల్ ఎంపీ అభ్య‌ర్థి ఎంపిక‌పై ఆ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని బీఆర్ఎస్ నాయ‌కుల‌తో కేసీఆర్ సుదీర్ఘంగా చ‌ర్చించారు. అనంత‌రం సుధీర్ కుమార్ పేరును ప్ర‌క‌టించారు. హ‌న్మ‌కొండ జ‌డ్పీ చైర్మ‌న్‌గా సుధీర్ కుమార్ కొన‌సాగుతున్నారు.

Spread the love