నవతెలంగాణ జనగామ: జనగామ జడ్పీ ఛైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి గుండెపోటుతో సాయంత్రం కన్నుమూశారు. హనుమకొండలో నివాసం ఉంటున్న ఆయనకు సోమవారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయన్ని హనుమకొండలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. సంపత్‌రెడ్డి ప్రస్తుతం జనగామ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు. సంపత్‌రెడ్డి ఆకస్మిక మృతికి పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కేసీఆర్ సంతాపం
తెలంగాణ ఉద్యమంలో తన వెంట నడిచిన సంపత్‌రెడ్డి తనను చాలా బాధించిందని కేసీఆర్ అన్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.