– కంటి ముందు అభివృద్ధి
– ఇంటి ముందు అభ్యర్థి
– ప్రెస్ మీట్ లో మంత్రి హరీష్ రావు
నవతెలంగాణ-జనగామ : ఎవరెన్ని ట్రిక్కులు చేసిన బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొడుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలంలో రూ .106 కోట్ల తో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలను మంత్రి హరీష్ రావు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంద్రకరణ్ రెడ్డి సత్యవతి రాథోడ్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక పాలకుర్తి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. అధిక సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. తెలంగాణలో అధికారంలో రావడమే కాకుండా దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కళ్ళ ముందు అభివృద్ధి, ఇంటి ముందు బీఆర్ఎస్ అభ్యర్థులు ఉంటారన్నారు. ప్రజలు ఎప్పుడూ నిర్ణయించుకున్నారని బీఆర్ఎస్ ను మరోసారి గెలిపిస్తారని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. బీజేపీ ఈసారి రాష్ట్రంలో దూసుకొబోతుందన్నారు. ఈ సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆరూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.