నవతెలంగాణ – హైదరాబాద్ : ఈ నెల 23న మధ్యాహ్నం ఒంటి గంటకు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరు కావాలని పార్టీ అధి నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ నెల 23 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. రేపు ఉదయం 11 గంటలకు శాసనసభలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రసంగం చేయనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్నారు.