పేదలకు విద్యను దూరం చేసే కుట్రలో బీఆర్‌ఎస్‌ : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పేదలకు విద్యను దూరం చేసే కుట్రలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నదని బహుజన సమాజ్‌పార్టీ(బీఎస్‌పీ)అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని విమర్శించారు. తమ రాజకీయ ఎదుగుదల కోసం కేసీఆర్‌ నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రకు చెందిన బీఆర్‌ఎస్‌ నేతకు మియాపూర్‌ ప్రభుత్వ భూములను అమ్ముకున్నారని పేర్కొన్నారు. 111జీవోను ఎత్తేసి హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న వేల ఎకరాల భూములను బినామీ కంపెనీలకు అప్పజెప్పారని తెలిపారు. ఉచిత విద్యనందిస్తామంటూ గద్దెనెక్కిన కేసీిఆర్‌ పేదలను విద్యకు దూరం చేస్తున్నారని పేర్కొన్నారు. మన ఊరు మన బడి నిధులను పక్కదారి పట్టించారని తెలిపారు.ఉన్న సచివాలయాన్ని కూల్చి రూ. 1400 కోట్లు ఖర్చుచేసి కొత్త సచివాలయాన్ని నిర్మించటంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.

Spread the love