బీఆర్‌ఎస్‌ విజయం ఖాయం

నవతెలంగాణ- భువనగిరి: రానున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం కోసం కార్యకర్తల కృషి చేయాలని ప్రజలు ఆశీర్వదించాలని రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు కొలుపుల అమరేందర్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం పట్టణంలోని ఆరో వార్డులో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు  ముల్కల సత్యనారాయణ, తుమ్మల పాండు, నీల శ్రీనివాస్ పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ లో చేరిక. భువనగిరి లోని రాయగిరి నుండి కాంగ్రెస్, బీజేపీ పార్టీలను వీడి బీఆర్‌ఎస్‌ లో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, భువనగిరి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య సమక్షంలో సుమారు 50 మంది యువకులు చేరారు.
Spread the love