మీర్‌పేట్‌లో దారుణ హత్య..

నవతెలంగాణ హైదరాబాద్: అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన మీర్‌పేట్‌లో చోటుచేసుకుంది. మీర్‌పేట్‌లో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న వనపర్తి జిల్లాకు షాఖాపూర్ గ్రామం చెందిన చిన్నపాగ చిన్న రాములు (35) తన భార్య కేశమ్మ అలియాస్ మహేశ్వరితో కలిసి అల్మాస్ గూడలో అద్దెకు ఉంటున్నాడు. జిల్లెలగూడలో నివాసముండే మంచాల రాముతో మహేశ్వరి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయాన్ని గమనించిన భర్త రాములు భార్యని పలుమార్లు హెచ్చరించిన మార్పు రాలేదు. భర్తతో గొడవపడి గత మూడు రోజుల క్రితం కేశమ్మ పిల్లలతో సహా తన సొంత గ్రామానికి వెళ్లిపోయింది.
ఈ నెల 20వ తేదీ శుక్రవారం రాత్రి ప్రియుడు మంచాల రాముతో ఫోన్‌లో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సమచారం అందిస్తూ భర్త హత్యకు పధకం వేసింది. ప్రియుడు తోపాటు మరో వ్యక్తి తెల్లపోగు దూలయ్యతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న రాములుపై గొడ్డలితో గొంతు, తలపై విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్రగాయాలు కావడంతో రక్తస్రావం అయి రాములు అక్కడికక్కడే మృతి చెందాడు.
హత్య విషయం తెలుసుకున్న మీర్ పేట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా నిందితులు నేరాన్ని అంగీకరించారు. ఏ1గా రాము, ఏ2 గా దూలయ్య, ఏ3 గా మహేశ్వరి లను చేర్చి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

Spread the love