నవతెలంగాణ-ఆసిఫాబాద్
వ్యక్తిగత కలహాలతో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగి అన్నయ్య చనిపోయిన సంఘటన మండలంలోని మోతుగూడలో చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ సీఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మోతుగూడ గ్రామంలోని ఆర్సిసి పైపుల ఫ్యాక్టరీలో బీహార్ రాష్ట్రానికి చెందిన సంజరు కుమార్, విజరు కుమార్ అన్నదమ్ములు లేబర్ పని చేస్తున్నారు. వారికి సోమవారం కూలీ డబ్బులు యజమాని ఇచ్చాడు. అదే రోజు రాత్రి అన్నదమ్ముల మధ్య డబ్బులు విషయంలో గొడవ జరిగింది. దీనితో తమ్ముడు అజరు అన్నయ్య సంజరు కుమార్‌ను కొట్టగా కిందపడి తనకు గాయమైంది. ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. కంపెనీ యజమాని వరప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.