
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణంలోని సంగీత నిలయం సమీపంలో ఓ యువకుడి నీ గొంతు కోసి దారుణ హత్య సోమవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు వేములవాడ పట్టణానికి చెందిన10 వార్డ ఓల్డ్ అర్బన్ కాలనీకి చెందిన కులుకుంట్ల శ్రీధర్ గా (25) పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. మృతుని భార్య పాత కక్షలు కారణంగానే ఈ హత్య జరిగినట్లుగా అనుమానిస్తున్నట్లుగా పోలీసులకు తెలిపారు. సంఘటన స్థలాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రైనీ ఎస్పి రాహుల్ రెడ్డి, డిఎస్పి నాగేంద్ర చారి పరిశీలించారు. త్వరలోనే నేరస్తులను పట్టుకుంటామని డిఎస్పి నాగేంద్ర చారి మీడియాకు తెలిపారు.