నవతెలంగాణ – శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోకి పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్ ప్రవేశించింది. దీని కదలికలను గమనించిన బీఎస్ఎఫ్ జవాన్లు వెంటనే అప్రమత్తమై డ్రోన్ పైకి కాల్పులు జరిపారు. సుమారు 24 రౌండ్ల పాటు కాల్పులు జరిపిన తర్వాత డ్రోన్ తిరిగి పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత రామ్‌ఘర్ సెక్టార్‌లోని నారాయణపూర్‌లో బీఎస్ఎఫ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. అయితే డ్రోన్ ద్వారా ఎలాంటి ఆయుధాలు, డ్రగ్స్ కానీ జారవిడవలేదని తెలిపారు.