నవ తెలంగాణ-సూర్యాపేట: ప్రజల కోసం పని చేసే బహుజన బిడ్డ వట్టె జానయ్య యాదవ్ ను ఎమ్మెల్యే గా బారి మెజారిటీ తో గెలిపించాలని 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ పిలుపునిచ్చారు.మంగళవారం స్థానిక 45 వ వార్డులో ఇంటింటికీ తిరుగుతూ నిర్వహించిన ప్రచారంలో ఆమె మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి నిరుద్యోగుల ను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలనికోరారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటే ఆ నీళ్లు, నిధులు, నియామకాలు ఎటుపోయాయో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా ఉచిత పథకాల పేరుతో మభ్యపెడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులు, యువత, మేధావులు, మహిళలు అర్థం చేసుకొని బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని కోరారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తన సమస్యలు గా భావించి పరిష్కరించే జానయ్య ఎమ్మెల్యే అయితే ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కావున
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా ఏకమై ఏనుగు గుర్తుకు ఓటు వేసి జానన్న ని ఎమ్మెల్యే గా గెలిపించాలని ఆమె కోరారు.