బీఎస్పీ ములుగు జిల్లా ఇన్చార్జిగా పసులది ముఖేష్..

నవతెలంగాణ -గోవిందరావుపేట
మండలానికి, చెందిన పసులది ముఖేష్ ను  బీఎస్పీ పార్టీ ములుగు జిల్లా ఇన్చార్జిగా బి ఎస్పి అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖేష్ మాట్లాడుతూ.. చల్వాయి గ్రామం, గోవిందరావుపేట మండల వాస్తవ్యుడనైనా నేను బహుజన్ సమాజ్ పార్టీ మండల కన్వీనర్ గా, మొదలైన నా ప్రయాణం ములుగు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శిగా, అసెంబ్లీ ఉపాధ్యక్షుడిగా, అసెంబ్లీ అధ్యక్షుడిగా, అసెంబ్లీ ఇన్చార్జిగా,అనేక స్థాయిలలో “నా” ఆర్థిక, కుటుంబ, సమస్యలను సైతం ఓర్చుకుంటు, బహుజన సమాజ్ పార్టీ నిర్మాణానికి, ఆర్నిశలు కృషిచేసి పార్టీని బలోపేతం చేస్తూ, పార్టీని ముందుకు నడిపిన   నా”నాయకత్వన్ని, పని విధానాన్ని గుర్తించిన, డాక్టర్ ప్రవీణ్ కుమార్, ములుగు జిల్లా ఇన్చార్జిగా నన్ను ఎంపిక చేసినందుకు ప్రవీణ్ కుమార్  కి అదే విధంగా నా ఈ ప్రయాణంలో నాకు అన్ని విధాలుగా సహకరించిన రాష్ట్ర నాయకులు బొట్ల కార్తిక్ కి ములుగు జిల్లా, అసెంబ్లీ, నాయకులకు, ప్రతేకంగా నా మండల నాయకులకు కృతజ్ఞతలు, తెలియస్తున్నాను అని అన్నారు. అదే విధంగా నాకు ఇచ్చిన ఈ బాధ్యతను (పదవిని) సక్రమంగా నిర్వహిస్తూ, బహుజన రాజ్య స్థాపన కొరకు ఎల్లవేళలా కృషిచేస్తానని, పసులాది ముఖేష్ ఈ సందర్భంగా తెలియజేసారు.
Spread the love