పీఆర్సీ కమిటీని నియమించాలి : బీటీఏ డిమాండ్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రెండవ ఉద్యోగుల వేతన సవరణ కమిటీ (పీఆర్సీ)ని తక్షణం నియమించాలని బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ (బీటీఏ) రాష్ట్ర శాఖ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఆదివారంనాడిక్కడి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్టు తెలిపారు. పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కమిటీ నివేదిక ఇచ్చే వరకు 20 శాతం ఐఆర్‌ ఇవ్వాలని కోరారు. ఉపాధ్యాయల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన అంశాలను త్వరగా పరిష్కరించాలని కోరారు. సమావేశంలో బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపకులు నూకలపాటి రమణయ్య, రాష్ట్ర గౌరవాధ్యక్షులు వడ్డేమాన్‌ బాలపీర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి గంగరాజు, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పట్నం చెన్నయ్య, కోశాధికారి కాడం బాలశంకర్‌, రాష్ట్ర కార్యదర్శి విజరు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love