సూసైడ్ నోట్ రాసి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య..

నవతెలంగాణ -హైదరాబాద్‌: యూసఫ్‌గూడ మధురానగర్‌లో చెందిన ద్రితేక్షణ్‌ వర్మ ఓ ప్రయివేటు కళాశాలలో బీటెక్‌ రెండో ఏడాది చదువుతున్నాడు. పరీక్షలో ఫెయిల్‌ అవుతాననే భయంతో సూసైడ్‌ నోట్‌ రాసి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మానాన్న క్షమించండంటూ.. సూసైడ్‌ నోటి రాసి బలవన్మరణానికి పాల్పడ్డారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Spread the love