నవతెలంగాణ – అమరావతి: అధికారం కోల్పోయిన రెండు నెలల్లోనే జగన్‌కు మతిభ్రమించిందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… అధికారంలో ఉన్నప్పుడు ప్రజల డబ్బుతో విర్రవీగాడన్నారు. అధికారం దూరమయ్యాక పిచ్చిపట్టినట్టు ఉందని ఎద్దేవా చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను జగన్ అవమానించారని ఆరోపించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టి తన పేరే పెట్టుకున్నాడని మండిపడ్డారు. అంబేడ్కర్ కంటే తానే గొప్పవాడినని అనుకుంటున్నాడన్నారు. జగన్ పాలనలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారని విమర్శించారు. అంబేడ్కర్ విగ్రహాలకు కూడా వైసీపీ రంగు వేసిన ఘనడు జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ను అడుగడుగునా అవమానించాడన్నారు. దళితులపై దాడులకు పాల్పడిన వారిని జగన్ కాపాడారని ఆరోపించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాధిత కుటుంబాలను పరామర్శించారా? అని నిప్పులు చెరిగారు.