– ఆరోగ్య సంరక్షణపై నిబద్ధతకు నిదర్శనం
– క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ గ్రూప్ చైర్మన్,
– నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కే హరి ప్రసాద్
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పె ట్టిన బడ్జెట్‌లో క్యాన్సర్ మందులను కస్టమ్స్ సుంకం నుం చి మినహాయించారని క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ గ్రూప్ చైర్మన్, నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కే హరి ప్ర సాద్ తెలిపారు. ఆరోగ్య సంరక్షణను మరింత అందు బాటులోకి తీసుకురావడంలో ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శ నమన్నారు. అరుదై న వ్యాధులకు ఉప యోగించే ఆహారాలు, మందులకు కస్టమ్స్ సుంకం మినహాయిం పు రోగులపై ఆర్థిక భారాన్ని గణనీయం గా తగ్గిస్తుందని తెలిపారు. ఇతర జీవనశైలి వ్యాధులకు సంబంధించిన మందులు, వైద్య వినియోగ వస్తువులకు మరిన్ని మినహాయింపుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామన్నారు. ఇది మరింత మందికి ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురా వడానికి సహాయ పడుతుందని పేర్కొన్నారు. గత ఏడాది తో పోలిస్తే హె ల్త్‌కేర్ బడ్జెట్ కేటాయింపుల్లో పెరుగుదల అంతంత మా తమేనన్నారు. అందరికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సా ధించడానికి ఉన్న అంతరాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఇంకా ఉందన్నారు.