విద్యుత్ షాక్ తో గేదలు మృతి..

నవతెలంగాణ-తుర్కయాంజల్
తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి మూడు గేదెలు మృతి చెందిన సంఘటన తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నే ముత్యాలమ్మ కుంటలో శుక్రవారం చోటు చేసుకుంది.బాధిత రైతు మర్రి జగన్ రెడ్డి కథనం ప్రకారం గత మూడు రోజుల క్రితం తెగిపడిన విద్యుత్తు తీగల ను ట్రాన్స్కో అధికారులు సరిచేయక పోవడంతోనే తన గేదెలు మృతిచెందాయని ఆవేదన వ్యక్తంచేశారు.శుక్రవారం ఉదయం మేత మేసుకుంటు వెళ్లిన గేదెలకు తెగిపడిన విద్యుత్తు తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాయని వాపోయాడు.దాదాపు 4లక్షల రూపాయల నష్టం జరిగిందని తెలిపారు. తనకు న్యంజరిగెల చూడాలని అధికారులను వేడుకుంటున్నాడు. సమాచారం అందుకున్న ట్రాన్స్కో, మున్సిపాలిటీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.బాధిత రైతుకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
Spread the love