27 నుంచి ఆరుట్లలో బుగ్గ జాతర ప్రారంభం

నవతెలంగాణ-మంచాల
ప్రతి ఏడాది కార్తీకమాసంలో ఆరుట్ల గ్రామంలో నిర్వహించే బుగ్గ రామలింగేశ్వరస్వామి ఉత్సవాలు ఈ నెల 27న ప్రారంభమై, అక్టోబర్‌ 12న ముగుస్తాయని సర్పంచ్‌ కొంగర విష్ణువర్ధన్‌ రెడ్డి తెలిపారు. బుధ వారం మండల పరిధిలోని ఆరుట్ల గ్రామంలో ‘బుగ్గ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల’ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ పాండాల జంగయ్యగౌడ్‌, గ్రామ పంచాయతీ కార్యదర్శి సిహెచ్‌. వెంకటేష్‌, వార్డు సభ్యులు మానుపాటి వెంకటేష్‌, కొండూరు మల్లేష్‌, ఎండీ. సద్దాంహుస్సేన్‌, గ్రామ కో-ఆప్షన్‌ సభ్యులు నాయినంపల్లి యాదయ్యగౌడ్‌, పీఎసీఎస్‌ డైరక్టర్‌ కొంగర జనార్ధన్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరక్టర్‌ ఎండీ. జానీపాషా, మాజీ సర్పంచ్‌ అనంగల్ల యాదయ్య, గ్రామస్తులు గుడ్డి మల్ల చంద్రయ్య, చిందం రఘుపతి, మార సురేష్‌, దామార భూపాల్‌, మధు, పోలమోనీ శివ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Spread the love