విద్యుత్‌ షాక్‌తో ఎద్దు మృతి

నవతెలంగాణ- తొర్రూర్‌ రూరల్‌
మండలంలోని సోమరపుకుంట తండా సోమారపు గ్రామంలో బోడియా అనే రైతు ట్రాన్స్ఫార్మర్‌ దగ్గర విద్యుత్‌ షాక్‌తో ఎద్దుమృతి చెందింది. ఎద్దు విలువ 80 వేల రూ పాయలు ఉంటుందని రైతు వాపోయాడు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఎద్దు మృతి చెందిందని, రైతును ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని గ్రామ సర్పంచ్‌ బానోత్‌ యాకమ్మ కోరారు.

Spread the love