నవతెలంగాణ మెదక్: సీఎం కేసీఆర్ ( CM KCR ) ప్రజా ఆశీర్వాద సభ నర్సాపూర్‌లో జరిగింది. ఈ సభలో ఒక్కసారిగా బుల్లెట్లు బయటపడ్డాయి. సభకు వచ్చిన అస్లాం అనే వ్యక్తి నుంచి రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సభ ప్రాంగణంలోకి వస్తుండగా తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి( sangareddy) జిల్లా రాయికోడ్(raikod)కి చెందిన అస్లాం అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.