భారత రైల్వేపై భారమేంటీ?

భారత రైల్వేపై భారమేంటీ?– తరుచూ ప్రమాదాలెందుకు?
– కవచ్‌ వ్యవస్థ పని తీరు ఎలా ఉంది?
– భద్రతను ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి?
అక్టోబర్‌ 17వ తేదీన ఎనిమిది బోగీల అగర్తలా-లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. అదే నెల 11వ తేదీన గూడ్స్‌ ట్రైన్‌ను ఓ ప్యాసింజర్‌ ట్రైన్‌ చెన్నైలో ఢకొీట్టింది. ఈ రెండింటిలో ప్రాణనష్టం జరగలేదు. కానీ, గతేడాది జూన్‌ 2వ తేదీన బాలాసోర్‌ ప్రమాదంలో 275 మందికి మించి మరణించారు. అధునాతన వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నా రైలు ప్రమాదాలు జరుగు తూనే ఉన్నాయి. సేఫ్టీ విషయమై రైల్వేపై ఒత్తిడి పెరుగుతూనే ఉన్నది. అదే సందర్భంలో తన మనుగడను సాగించే ఒత్తిడి కూడా రైల్వేపై ఉన్నది.
రైల్వే ఆదాయం పెరిగిందా?
ఇండియన్‌ రైల్వేస్‌పై నవతెలంగాణ ప్రత్యేక కథనం
ప్రమాదాలు పెరిగాయా? తగ్గాయా?
న్యూఢిల్లీ: 1960ల్లో యేటా 1,390 రైలు ప్రమాదాలు జరిగేవి. గత దశాబ్దంలో ఈ సంఖ్య 80కి తగ్గింది. 2021-22లో 34, 2022-23లో 48, 2023-24లో 40 రైలు ప్రమాదాలు జరిగాయి. రైలు ప్రమాదాల సంఖ్య, తీవ్రతను బట్టి ప్రాణనష్టం, రైల్వే శాఖ ఆస్తి నష్టం ఉంటుంది. ఈ చర్చ నడుమ కేంద్ర ప్రభుత్వం కవచ్‌ను ప్రవేశపెట్టింది. ఆటోమేటిక్‌ ట్రైన్‌ ప్రొటెక్షన్‌ సిస్టమ్‌నే కవచ్‌ అని పిలుస్తున్నాం. తమకు సమీపంగా మరో ట్రైన్‌ వచ్చినప్పుడు లోకో పైలట్‌ను అలర్ట్‌ చేయడం, ఆటోమేటిక్‌ బ్రేకులు పడటం ఈ వ్యవస్థలో భాగంగా ఉంటాయి. అయితే కవచ్‌ వచ్చాక కూడా ప్రమాదాలు జరగడం కొత్త చర్చను ముందుకు తెచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి కల్లా 1,465 కిలోమీటర్ల(మొత్తం నెట్‌వర్క్‌లో ఇది 2శాతం కిలోమీటర్లు మాత్రమే) రూట్‌లో కవచ్‌ ఏర్పాటు చేశారు. బాలాసోర్‌ యాక్సిడెంట్‌ తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ మాట్లాడుతూ ఒక కిలోమీటర్‌కు రూ. 50 లక్షలు, లోకో మోటివ్‌కు రూ. 70 లక్షలు ఖర్చవుతాయని వివరించారు. ఈ వ్యవస్థ అమలులో తీవ్ర జాప్యం ఉన్నదని ప్రశ్నిస్తే.. అధికారులు గత ప్రమాదాలతో పోలికలు తీస్తున్నారు. కానీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ గతంలో లేదు. అప్పటి పరిస్థితులను నేటితో పోల్చడం సహేతుకం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రమాదాలను పూర్తిగా నివారించే అవకాశాలు ప్రభుత్వం ముందు ఉన్నాయి. 1990-91లో సుమారు 70 శాతం పెద్ద ప్రమాదాలు రైలు పట్టాలు తప్పడమేనని రైల్వే పేర్కొంది. కేవలం 2 శాతం మాత్రమే రైళ్లు ఢకొీన్న ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు కవచ్‌ కూడా కవరైపెట్టరు యాక్సిడెంట్‌ను నివారించలేకపోవడం చర్చనీయాంశమైంది. కవచ్‌ మినిమమ్‌ మార్జిన్‌కు అవతల తప్పిదం జరగడంతో ఈ యాక్సిడెంట్‌ జరిగిందని అధికారులు పేర్కొన్నారు.
ఆదాయం ఎలా ఉంది?
2024-25లో రూ. 100 ఆర్జించడానికి పెట్టే ఖర్చు రూ. 98.2(ఆపరేటింగ్‌ రేషియో)గా ఉన్నది. క్రితం ఏడాది ఇది రూ. 98.7గా ఉన్నది. కొంత మెరుగైనా.. 2016లోని రూ.97.8తో పోల్చితే మందగించింది. ఓఆర్‌ ఎక్కువ ఉంటే బడ్జెట్‌పై, అదనపు కేటాయింపులపై రైల్వే ఆధారపడాల్సిన అవసరం ఉండదు. రైల్వేకు రెండు మార్గాల్లో ఆదాయం వస్తుంది. ఒకటి ప్యాసింజర్‌ సర్వీస్‌, రెండు ఫ్రెయిట్‌ సర్వీస్‌. ఇందులో ఫ్రెయిట్‌ ద్వారానే 65 శాతం రాబడి వస్తుంది. సుమారు 30 శాతం రైల్వే నెట్‌వర్క్‌ను 100 శాతం ఉపయోగించుకుంటున్నట్టు నేషనల్‌ రైల్‌ ప్లాన్‌ ముసాయిదా పేర్కొంది. ఫ్రెయిట్‌ మూవ్‌మెంట్‌ మెల్లిగా ఉండటం వల్ల రైలు పట్టాలు ఆక్రమించే ఉంటు న్నాయి. ఇందుకోసం మౌలిక సదుపాయాలు మరింత వద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, బడ్జెటరీ కేటాయింపులు ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఎప్పటికప్పుడు కొత్త పరికరాలు, ట్రాక్‌లను రీప్లేస్‌ చేయడం, బోగీల మెయింటెయినింగ్‌ కూడా పర్యవేక్షించాల్సి ఉంటుంది. 2023-24 బడ్జెట్‌లో ట్రాక్‌ రెనివల్‌ కోసం పెట్టుబడి 7.2 శాతానికి తగ్గించారు. రాష్ట్రీ రైల్‌ సంరక్ష కోశ్‌ సేఫ్టీ ఫండ్‌ రిపేర్‌, రీప్లేస్‌కు చెల్లించే స్థితిలో లేదని రైల్వేస్‌ స్టాండింగ్‌ కమిటీ పేర్కొంది.
ా్యసింజర్‌ రెవెన్యూ నష్టాలను ఫ్రెయిట్‌ లాభాలు ఓ మేరకు పూడ్చుతున్నాయి. 2019-20లో ప్రయాణికులకు సేవలు అందించడం ద్వారా సుమారు రూ. 50 వేల కోట్లు రాబడి వస్తే.. రూ.63 వేల కోట్ల నష్టం వాటిల్లింది. 2021-22లో కరోనా విపత్తు కాలంలో చాలా ట్రైన్లు రద్దు చేయడం మూలంగా రూ. 68 వేల కోట్ల నష్టం వచ్చింది. 2024 జులై పీఆర్‌ఎల్‌ విశ్లేషణ ప్రకారం 2024-25లో ప్యాసింజర్‌ సర్వీస్‌ రెవెన్యూ రూ. 80 వేల కోట్లు ఉండొచ్చు. ట్రాఫిక్‌ ఎక్కువ ఉన్న రూట్లలో వందే భారత్‌లు ప్రవేశపెట్టడం, చాలా వరకు స్లీపర్‌, సెకండ్‌ క్లాస్‌ కోచ్‌ల స్థానాల్లో ఖరీదైన ఏసీ కోచ్‌లను చేర్చడం ద్వారా కూడా ఈ ఏడాది రాబడి పెరిగే అవకాశం ఉన్నది.భారతీయులకు చౌక ప్రయాణ సేవలు అందించడం, లాభసాటి వ్యాపార లక్ష్యాల మధ్య రైల్వే చిక్కుకుంది. పెరుగుతున్న వేతనాలు, పింఛన్లు, ఇంధన ఖర్చులు రైల్వే నష్టాలకు తోడవుతున్నాయి. కాగా, లోకో పైలట్ల పరిస్థితి అధ్వానంగా ఉంటున్నదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఎక్కువ ఫ్రెయిట్‌ మూవ్‌మెంట్‌ ఉండే జోన్‌లలో12 గంటల షిఫ్ట్‌లతో ఒత్తిడి పెరుగుతున్నదని చెబుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అవసరమైన నిధులను సంపాదించు కోవడం, ఆదాయం పెంచాలని, రద్దీని తగ్గించాలనే డిమాండ్లతో రైల్వే నిత్యం లక్ష్యాల ఛేదనలో సతమతం అవుతున్నది.

Spread the love