పేదలపై భారాలు.. పెట్టుబడిదారులకు రాయితీలు: పల్లపు వెంకటేష్.

నవతెలంగాణ- ఆర్మూర్: పేదలపై భారాలు పెట్టుబడిదారులకు రాయితీలు అని సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ అన్నారు. పెరుగుతున్న ధరలను తగ్గించాలని గురువారం పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం ధర్నా నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం పార్టీ ఆల్ ఇండియా పిలుపుమేరకు పెరుగుతున్న ధరలను అదుపు చేయాలని అన్నారు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడేదారులకు రాయితీలు ఇస్తూ సామాన్య పేద ప్రజలపై భారాలు మోపుతుందని అన్నారు ఈ మధ్యకాలంలో బియ్యం ధరలు ఆకాశాన్ని అంటున్నాయని నిత్యవసర వస్తువు ధరలని రోజు రోజు పెరుగుతున్నాయని సిలిండర్ ధర 2014లో 400 ఉన్న సిలిండర్ 1200 కు పెరిగిందని అన్నారు పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజు పెరుగుతున్న ప్రభుత్వం వాటిని అదుపు చేయలేక పోతుందని అన్నారు దీనికి తోడుగా వేసి ప్రజల మీద మరింత పన్నులు వేసే ప్రజల నడ్డి విరుస్తుందని అన్నారు ఒకవైపు పాల ధరలు పెంచుతూ ఉప్పు పప్పు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయని సామాన్య ప్రజల కూలి రేటు పెరగకపోవడంతో తమ కుటుంబాన్ని పోషించుకోవటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు పిల్లలను చదివించుకోలేక ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు కిరాయి కట్టలేక కరెంటు బిల్లు కట్టలేక సతమతమవుతున్నారని అన్నారు పైగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయటం పెట్టుబడేదారులకు అనుకూలంగా చట్టాలు మార్చడం కార్మికుల వేతనాలు పెంచకపోవడం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని కాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు దేశ సంపదనంతా ఆదా నీ అంబానీలకు కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం ధరలను అదుపు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం చేయకపోగా సామాన్యుల ప్రజల మీద భారాల మోపే పద్ధతిని మానుకోవాలని ఇదే రకంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇంటికి ప్రజలు సాగనంపుతారని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి కూతాడి ఎల్లయ్య, ఏరియా కమిటీ సభ్యులు తోగాటి భూమేశ్వర్, భామనుల రవి, సిద్ధల నాగరాజు, అశోక్ ,రాజు ,చిన్నయ్య, జోహార్ సింగ్ ,రమేషు, సాజిద్ ఖాన్, ఆలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు..
Spread the love