
గాంధారి మండల కేంద్రంలోని పాత పోలీస్ స్టేషన్ దగ్గరలో వడ్ల కమ్మరి గల్లీలో గల కంకంటి కవిత నిన్న ఉదయం తన ఇంటికి తాళం వేసి ఫంక్షన్ నిమిత్తం తన బంధువుల గ్రామం ముదేల్ కి వెళ్లగా ఈరోజు ఉదయం. పక్కింటి వారు కవితకు ఫోన్ చేసి మీ ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లో దొంగలు పడినట్లు అనుమానం ఉన్నది కవితకు తెలవగా వెంటనే తను ఇంటి వద్దకు వచ్చి చూసి సరికి డోర్ యొక్క గొళ్ళెం పగలగొట్టి తన ఇంట్లో గల 1.2 తులాల బంగారం, 5 తులాల వెండి మరియు నగదు పోయినది అని కవిత ఫిర్యాదు చేయగా ఎస్ఐ ఆంజనేయులు దొంగతనం జరిగిన ఇంటిని పరిశీలించి కేసు నమోదు చేసి క్లూస్ టీం ని పిలవఢం జరిగిందని మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.