తాళం వేసిన ఇంట్లో దొంగల చేతివాటం

– నగదు, నగలు అపహరణ
– దర్యాప్తు చేపట్టిన పోలీసులు
నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ కేంద్రంలో తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు చేతి వాటాన్ని ప్రదర్శించారు. మూడవ టౌన్ పరిధిలోని దుబ్బ ప్రాంతంలో అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే అశోక్ అనే వ్యక్తి గురువారం రోజున ఇంటికి తాళాలు వేసి శుభకార్యం నిమిత్తం సిద్దిపేటకు వెళ్లారు. ఇంటికి తాళాలు ఉండడంతో ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి, లోనికి ప్రవేశి ఇల్లంతా చిందర వందల చేశారు. బీరువాను ధ్వంసం చేసి అందులోంచి నగదు, నగలు దోచుకెళ్లారు. శనివారం ఉదయం ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో, ఇది చూసిన స్థానికులు మూడవ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. బాధితుడు వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు.
Spread the love