సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

నవతెలంగాణ- నవీపేట్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా మండల కేంద్రంలో మండల బీజేపీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను గురువారం దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల గలాన్ని నొక్కే ప్రయత్నం చేయవద్దని అన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో ప్రతిపక్షంగా ఉన్న కేసీఆర్ ను అప్పటి ప్రభుత్వాలు అవకాశమిచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సరిన్, అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్ రెంజల్ ఎంపీపీ కిషోర్, జడ్పిటిసి మేక సంతోష్ వైస్ ఎంపీపీ యోగేష్, ప్రధాన కార్యదర్శులు బందేల ఆనంద్ మేక రామకృష్ణ, మంత్రి రాజేందర్ గౌడ్, మువ్వ నాగేశ్వర్ రావు, పుట్ట శ్రీనివాస్ గౌడ్, పిల్లి శ్రీకాంత్, మల్లేష్ యాదవ్, బండారి రాజశేఖర్ l తదితరులు పాల్గొన్నారు.
Spread the love