– ఘనంగా విజయదశమి వేడుకలు…
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో శనివారం ఘనంగా విజయదశమి వేడుకలు ప్రజలు నిర్వహించుకున్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో విజయదశమి వేడుకలను ఆయా గ్రామాలల్లో తంగళ్ళపల్లి ఆదర్శ యూత్ క్లబ్, పద్మశాలి సంఘం, పద్మనగర్ పద్మశాలి సేవా సంఘం, ఆదర్శ క్లబ్, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు,ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. కొత్త బట్టలు ధరించి జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి, ఒకరినొకరు జమ్మిని పంచుకొని అలైబలై చేసుకున్నారు. సాయంత్రం తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిషాసుర మర్దిని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బహిషాసురుని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నూతనంగా ఎన్నికైన సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వేల్పుల స్వరూప తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్, రిటైడ్ జిల్లా జడ్జ్ వరప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ బండి దేవదాస్, వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి, ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు ఎడమల శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సామల గణేష్, క్లబ్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.