బీఆర్ఎస్ ను వీడిన ఎమ్మెల్యేల దిష్టిబొమ్మ దహనం

నవతెలంగాణ-బెజ్జంకి : బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాధికారంలో ఉన్నత పదవులు అనుభవించి మళ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన బాన్సువాడ,జగిత్యాల నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి,సంజయ్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ యువజన మండలాధ్యక్షుడు బిగుల్ల మోహన్ అధ్వర్యంలో అందోళన వ్యక్తం చేశారు.సోమవారం మండల కేంద్రంలోని స్థానిక అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా వద్ద బీఆర్ఎస్ యువజన మండలాధ్యక్షుడు బిగుల్ల మోహన్ అధ్వర్యంలోఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి,సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని వ్యతిరేకిస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు.నాయకులు దీటి బాలనర్సు,కోర్వి తిరుపతి,బిగుల్ల సుదర్శన్, మామిండ్ల తిరుపతి,కనగండ్ల శ్రీను,లింగాల మధు,మంకాళి బాబు,బాబు మియా,ఉతకం నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love