మళ్లీ మండుతున్న ఎండలు..

నవతెలంగాణ- హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రత కొద్దిరోజుల గ్యాప్ తరువాత మళ్లీ పెరిగింది. ఒకవైపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండగా మరి కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు పెరిగాయి. మంగళవారం రోజున రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం అర్లిలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొండాపూర్, నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండల కేంద్రంలో 43.4, కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్, ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం చాప్రాలలో 43.2, ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలలో 43.1 డిగ్రీల సెల్సియస్‌ ఉందని వెల్లడించారు.

 

 

Spread the love