తగలబడ్డ డిఆర్ సి సెంటర్

– పొగతో నిండిన కాలనీలు
నవతెలంగాణ – సిద్దిపేట
పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ రోడ్డులో గల మున్సిపల్ డ్రై రిసోర్సెస్ సెంటర్ ( డంపింగ్ యార్డులో)లో అగ్ని ప్రమాదం జరిగి, పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పట్టణంలో నీ ప్రజల నుండి సేకరించిన పొడి చెత్తను ఇక్కడ నిల్వ చేస్తారు. ఇది ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించగా, వారు పొడి చెత్తను, కవర్లను డీసీఎంలోకి ఎక్కిస్తుండగా ప్రమాదం జరిగిందని ఎల్ అక్కడ పనిచేస్తున్న వారి తెలిపారు. ప్రమాదంలో డీసీఎం, స్వచ్ఛ ఆటోలు, బేల్లింగ్ మిషన్లో, కాన్వాయర్ బెల్టులు,  కంపాక్టర్లు కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన అరగంట తర్వాత ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేసింది. దుబ్బాక నుండి కూడా మరో ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పడానికి సహాయక చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ శ్వేత సంఘటన స్థలానికి చేరుకునే వివరాలు తెలుసుకున్నారు. పూర్తి వివరాలు తెలవలసి ఉంది.

Spread the love